byసూర్య | Wed, Sep 20, 2023, 12:59 PM
మేడ్చల్ జిల్లా, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ బస్టాప్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి నలుగురికి గాయాలయ్యాయి. రెండో విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కోసం కుత్బుల్లాపూర్‌కి మంత్రి కేటీఆర్ వసున్నారు. నేపథ్యంలో ఉదయం 5 గంటల సమయంలో స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురికి విద్యుత్ షాక్ తలిగింది. దీంతో విఠల్ (19), దుర్గేష్ (19 ), బాలరాజు (18), నాగనాథ్ (33)కు గాయాలయ్యాయి. ముఖ్యంగా నాగ్ నాథ్ (33)అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.