నేడు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం

byసూర్య | Wed, Sep 20, 2023, 12:58 PM

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో బుధ, గురువారాలు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీకి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్ధికి, జిగ్నేష్ మేవాని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే తదితరులు హాజరవుతారు. ఇప్పటికే సర్వే నివేదికలను తెప్పించుకున్న స్క్రీనింగ్ కమిటీ.. వడపోత అనంతరం తమ నివేదికను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిపారసు చేయనుంది. సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా చేసుకుని అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేయనుంది.


Latest News
 

తెలంగాణ బిజేపీ ఛీప్ గా ఆయన పేరు ఖరారు..? Thu, Oct 31, 2024, 04:53 PM
సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి కీలక ప్రకటన Thu, Oct 31, 2024, 04:49 PM
స్టార్ క్యాంపెయినర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క Thu, Oct 31, 2024, 04:45 PM
మధిర మండలంలో పర్యటించిన సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకులు Thu, Oct 31, 2024, 04:44 PM
దేశానికి ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి: కాంగ్రెస్ Thu, Oct 31, 2024, 04:43 PM