byసూర్య | Thu, Oct 31, 2024, 04:45 PM
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బాధ్యతలు అప్పగించారు. స్టార్ క్యాంపెయినర్లుగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడుదల చేసిన జాబితాలో ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. జార్ఖండ్ లో 81 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 13న 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, NOV 30న 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.