byసూర్య | Thu, Oct 31, 2024, 04:44 PM
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని పలు గ్రామాలలో గురువారం సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, పోతినేని సుదర్శన్ ముమ్మరంగా పర్యటించారు. ముందుగా మండల సీపీఎం పార్టీ నాయకులతో సమావేశమై పలు గ్రామాలలో గల ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.