సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి కీలక ప్రకటన

byసూర్య | Thu, Oct 31, 2024, 04:49 PM

దీపావళి పండుగ రోజు రాత్రికి ఎన్ని క్రాకర్స్ పేలుతాయో.. ఎంత కాలుష్యం కమ్ముకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. మనం ప్రతీ సంవత్సరం చూస్తూనే ఉన్నాం.ముఖ్యంగా హైదరాబాద్ లో నివసించే యువత రోడ్లపై బాంబులు పేల్చుతూ బైకులపై తిరుగుతుంటారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు.సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే క్రాకర్స్ కాల్చుకోవాలని సూచించారు. ఈ మేరకు పొల్యుషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఆర్డర్స్ వచ్చాయని ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 02 వరకు దీపావళి సందర్భంగా ఈ నిబంధనలు ఉంటాయని ప్రజలు గ్రహించి తమకు సహకరించాలని కోరారు. రాత్రి 8 గంటలకు ముందు కానీ.. 10 గంటల తరువాత కానీ పబ్లిక్ ప్లేసుల్లో, పోలీస్ స్టేషన్ల పరిదిలో క్రాకర్స్ పేల్చితే వారిపై చట్టపరమ్ైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని గమనంలో పెట్టుకొని దీపావళి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు సీపీ అవినాష్ మోహంతి.


Latest News
 

రేపు ప్రధాని సభకు 2 వేల మందితో భద్రత: సీపీ సుమతి Sat, May 09, 2026, 05:51 PM
హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చాలి: సీఎం రేవంత్ రెడ్డి Sat, May 09, 2026, 05:50 PM
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ Sat, May 09, 2026, 04:27 PM
అన్‌ లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలి: కలెక్టర్ Sat, May 09, 2026, 04:26 PM
మైనారిటీలకు గుడ్‌న్యూస్‌.. స్కిల్ డెవలప్‌మెంట్ డిగ్రీ కళాశాలల ఏర్పాటు Fri, May 08, 2026, 09:58 PM