మోకిల ఘటన నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్

byసూర్య | Thu, Oct 31, 2024, 05:16 PM

దీపావళి పండుగ సందర్భంగా బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి దావత్ చేసుకోవాలనుకుంటే... మందు తాగాలనుకుంటే ఈ జాగ్రత్తలు పాటించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని సూచనలు చేశారు. ఇటీవల మోకిలలో జరిగిన (జన్వాడ ఫాంహౌస్ కేసు నేపథ్యంలో) జరిగిన ఘటన నేపథ్యంలో కొన్ని సూచనలు చేశారు. చివరలో ఇది సెటైర్ కాదని... తన నుంచి సీరియస్ సూచన అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఈ సూచనలు చేశారు.అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేసి 'గుడ్ అడ్వైజ్ అన్నా' అని రాసుకొచ్చారు."తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరందరు మీ కుటుంబాలతో హాయిగా గడపాలని కోరుకుంటున్నాను. అయితే... గతవారంలో మోకిలలో ఊహించని వేగంతో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా, పండుగల సందర్భంగా ప్రజలు కింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోమని చెప్పడం నా బాధ్యత గా భావిస్తున్నాను" అని ప్రవీణ్ కుమార్ రాసుకొచ్చారు.


Latest News
 

ఆ విషయంలో కాంగ్రెస్ సర్కార్‌‌ భేష్..‌ ఇదే ఆనవాయితీ కొనసాగించాలి.. బండి సంజయ్ ప్రశంసలు Sat, Nov 02, 2024, 11:24 PM
ఆ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు, ఆ ఛార్జీలు కూడా తగ్గింపు Sat, Nov 02, 2024, 11:20 PM
మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి Sat, Nov 02, 2024, 11:16 PM
బీఆర్ఎస్ జాతకాలు మా దగ్గరున్నాయి.. అవన్నీ చెప్తే తట్టుకోలేరు.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్లు Sat, Nov 02, 2024, 09:38 PM
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు Sat, Nov 02, 2024, 09:36 PM