byసూర్య | Thu, Oct 31, 2024, 05:19 PM
దీపావళి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో టపాసులు కాల్చుకోవడంపై ఆంక్షలు విధించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చుకోవాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిమితులకు లోబడి టపాసులు కాల్చుకోవాలని వెల్లడించారు.ఈరోజు నుంచి నవంబర్ 2వ తేదీ వరకు దీపావళి పండుగ సందర్భంగా ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. రాత్రి ఎనిమిది గంటలకు ముందు గానీ లేదా రాత్రి 10 గంటల తర్వాత గానీ బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ రోడ్లపై బాణసంచా కాలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. దీనిని గమనించి అందరూ దీపావళి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.