byసూర్య | Thu, Oct 31, 2024, 07:05 PM
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మూసీ పరీవాహక ప్రాంతంలో... కాంగ్రెస్ నేతలు ఇంటిని, బెడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మూసారాంబాగ్ ప్రాంతంలోని స్థానిక కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... మూసీ పరీవాహక ప్రాంతంలో కేసీఆర్‌తో పాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు ఇంటిని, బెడ్డును ఏర్పాటు చేశామన్నారు. వారు ఉండేందుకు మంచినీళ్లు, సోఫాలు, బకెట్లు, కార్పెట్లు... ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఒక్కరోజు తమతో ఉండాలన్నారు. ఈ ప్రాంతంలో ఉంటే గానీ ఇక్కడి ప్రజల బాధలు అర్థం కావన్నారు.కేసీఆర్‌కు జూబ్లిహిల్స్‌లో బంగ్లా, ఎర్రవెల్లిలో ఫాంహౌస్ కావాలని... కానీ మూసీ ప్రాంతంలో ఉంటే కానీ వారికి తమ సమస్యలు అర్థం కావన్నారు. తమ సవాల్‌ను స్వీకరించి వారు ఇక్కడ నివసించేందుకు రావాలని సూచించారు. వారు వస్తే స్వాగతం పలికేందుకు మహిళలు పూలదండలతో సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఇంటికి ఓ వైపు కేసీఆర్, మరోవైపు ఈటల ఫొటోలను ఏర్పాటు చేశారు.మూసీ పరీవాహక ప్రాంతం నుంచి డబుల్ బెడ్రూం ఇళ్లకు ఇక్కడి వారిని తరలిస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు, మూసీ ప్రభావిత ప్రజలు... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. తమను ఇక్కడి నుంచి తరలించి... డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూంలలో ఉండేందుకు ఇక్కడి వారు సిద్ధంగానే ఉన్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.