byసూర్య | Wed, Sep 20, 2023, 12:57 PM
అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయడమే కాక కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని ఐఎఫ్ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామయ్య డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. అంగన్వాడీ ఉద్యోగుల్లో ఎక్కువమంది బడుగు, బలహీన వర్గాల వారేనని తెలిపారు. సమస్యల పరిష్కారానికి వీరు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకవడం సరికాదన్నారు.