byసూర్య | Wed, Sep 20, 2023, 12:56 PM
పాతకక్షల నేపథ్యాన ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన కామేపల్లి మండలంలోని పండితాపురంలో బుధవారం తెల్లవారుజామునచోటుచేసు కుంది. గ్రామానికి చెందిన బొమ్మగాని పిచ్చయ్యపై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో పిచ్చయ్య ఎడమ చెయ్యి విరగగా, కుటుంబీకులకు చికిత్స నిమిత్తం 108లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి ఎస్సై ప్రవీణ్ కుమార్ చేరుకుని విచారణ చేపట్టారు.