byసూర్య | Wed, Sep 20, 2023, 12:56 PM
సత్తుపల్లి మండలం కిష్టారం వై-జంక్షన్లో ఉన్న బంక్ లో పెట్రోల్ కల్తీ చేస్తున్నారని వాహనదారులు ఆరోపించారు. ఓ వ్యక్తి మంగళవారం బాటిల్ లో లీటర్ పెట్రోల్ పోయించుకోగా అడుగు భాగాన నీరు కనిపించింది. దీంతో మరి కొందరు వాహనదారులతో బాటిల్ లో అడుగుకు చేరిన నీరు కలిసి ఆయన బంక్ నిర్వాహకులను నిలదీశాడు. ఇకనైనా అధికారులు స్పందించి బంక్ ల్లో తనిఖీలు చేపట్టి కల్తీ జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.