byసూర్య | Wed, Sep 20, 2023, 12:55 PM
జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా మొదటి విడత పాఠశాలల్లోని పనులను అక్టోబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. కలెక్టరేట్లో విద్యాశాఖ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ. పనులు పూర్తయ్యేలా ఎంఈఓలు, హెచ్ఎంలు చొరవ చూపాలని చెప్పారు. అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్సింగ్, జెడ్పీ సీఈఓ అప్పారావు, డీఈఓ సోమశేఖరశర్మ పాల్గొన్నారు.