byసూర్య | Wed, Sep 20, 2023, 12:54 PM
మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సోదరుడు జలగం రామారావు (94) మంగళవారం హైదరాబాద్ లో కన్నుమూశారు. నేవీలో కెప్టెన్ గా విధులు నిర్వర్తించిన ఆయన ఉమ్మడి జిల్లా వాసులకు సుపరిచితులు. ఆల్ ఇండియా వెలమ సంఘం అధ్యక్షుడిగా, పర్యావరణ సంఘం సభ్యుడిగా గతంలో సేవలందించారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం అంకంపాలెం, పట్వారి గూడెంల్లో భూములు కోల్పోయిన గిరిజనుల పక్షాన పోరాడి తిరిగి ఇప్పించారు.