రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు... హైదరాబాద్‌ కు చిరు జల్లులు

byసూర్య | Wed, Mar 22, 2023, 11:16 AM

 మరో ఐదు రోజుల పాటు తెలంగాణ కు  వర్ష సూచన ఉన్నట్లు వాాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో ఇప్పటికే అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తోండగా.. మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశముంది. రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తన వెదర్ బులిటెన్‌లో స్పష్టం చేసింది. మంగళవారం రాత్రి విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు చాలా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. 22,23వ తేదీలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.


ఇక 24వ తేదీ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. 24వ తేదీ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక 25,26వ తేదీల్లో చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లో 22వ తేదీ ఉదయం పొగమంచు ఉంటుందని, అలాగే ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. ఇక 23వ తేదీ ఉదయం పొగమంచుతో పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, చిరు జల్లులు పడే అవకాశముందని అంచనా వేసింది.


ఇక 24వ తేదీ సాయంత్రం లేదా రాత్రి హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన చిరు జల్లులు పడే అవకాశముందని తన ప్రకటనలో వాతావరణశాఖ పేర్కొంది. అలాగే 25వ తేదీ సాయంత్రం లేదా రాత్రి ఉరుములతో కూడిన చిరు జల్లులు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.



Latest News
 

గౌలిగూడలో విస్తృత ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు Sat, May 04, 2024, 02:58 PM
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలి Sat, May 04, 2024, 02:55 PM
ఎంపీ అభ్యర్థులు ఏం చదివారో తెలుసా? Sat, May 04, 2024, 02:54 PM
అర్ధరాత్రి భారీ చోరీ Sat, May 04, 2024, 02:52 PM
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: శ్రీధర్ సుమన్ Sat, May 04, 2024, 02:50 PM