పేపర్ల లీకేజీ కేసులో ,,కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంఛార్జ్‌ను విచారించిన సిట్

byసూర్య | Wed, Mar 22, 2023, 11:15 AM

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో నాలుగో రోజు సిట్ విచారణలో భాగంగా కమిషన్‌ కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ శంకరలక్ష్మిని పోలీసులు విచారించారు. పరీక్షా పేపర్లు కొట్టేసేందుకు నిందితులు ప్రవీణ్‌ కుమార్‌, రాజశేఖర్‌ రెడ్డిలు కమిషన్‌లోని ఆమె కంప్యూటర్‌ను వినియోగించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడెంది. శంకరలక్ష్మీ డైరీ నుంచి కాన్సిటెన్షియల్ కంప్యూటర్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను తీసుకున్నట్లు నిందితులు చెప్పారు. అయితే శంకరలక్ష్మీ వాదన మాత్రం మరోలా ఉంది.. తాను డైరీలో ఎలాంటి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్ రాయలేదని చెప్పారు. దీంతో ఆమెను సిట్ అధికారులు మంగళవారం విచారణకు పిలిచారు. గంటపాటు ప్రశ్నించిన సిట్ అధికారులు ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం.


ఇక ఈ కేసులో నాలుగోరోజు పోలీసు కస్టడీలో కీలక సమాచారం రాబట్టారు. 9 మంది నిందితుల మొబైల్‌ఫోన్లలోని కాల్‌డేటా, వాట్సప్‌ గ్రూపులు, చాటింగ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నపత్రాలు ఎవరికి విక్రయించారనే అంశంపై అధికారులు దృష్టిసారించారు. కమిషన్‌లోని వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 8 మంది టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు గతేడాది అక్టోబరులో జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరైనట్లు సిట్ విచారణలో తాజాగా వెల్లడైంది. వీరిలో కొందరు 100కు పైగా మార్కులు సాధించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు గానూ సిట్‌ అధికారులు నోటీసులు జారీచేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.


మరోవైపు.. సిట్‌ అధికారులు నిందితుల నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి వివరాలు రాబట్టారు. ఈ కేసులో ఏ3గా ఉన్న రేణుక రాథోడ్‌, ఆమె భర్త డాక్యానాయక్‌లను మహబూబ్‌నగర్‌ జిల్లా పగిడ్యాల్‌ పంచగల్‌ తండాలోని వారి నివాసానికి తీసుకెళ్లి విచారించారు. అనంతరం బండ్లగూడ జాగీర్‌ సన్‌సిటీలో ఈ దంపతులు ఉంటున్న ఇంట్లోనూ సోదాలు జరిపారు. మరో బృందం బడంగ్‌పేట్‌, మణికొండ ప్రాంతాల్లోని ప్రవీణ్‌ కుమార్‌, రాజశేఖర్‌ రెడ్డిల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు ప్రశ్నపత్రాలు, పెన్‌డ్రైవ్‌ లభించినట్లు తెలిసింది.


ఒకవేళ తాము పట్టుబడినా. ఎక్కడా సాక్ష్యాలు చిక్కకుండా ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డిలు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించినట్లు తెలిసింది. పెన్‌డ్రైవ్‌లకు పాస్‌వర్డ్స్‌ క్రియేట్ చేసిన నిందితులు.. పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పుడు పాస్‌వర్డ్స్‌ మరచిపోయామంటూ వారిని ఏమార్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇక టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను సైబర్ నిపుణలు విశ్లేషిస్తున్నారు. త్వరలోనే ఈ కేసును ఓ కొలిక్కి తీసుకొస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM