తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల

byసూర్య | Fri, Oct 25, 2024, 08:30 PM

పత్తి రైతుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ సేవలను ప్రారంభించింది. వాట్సప్ నంబర్ 8897281111 ద్వారా పత్తి అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సిద్ధమైంది.వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పత్తి పంట క్రయవిక్రయాల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని ఈ సేవలను ప్రారంభించింది. పత్తి కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలు, చెల్లింపు స్థితి, సీసీఐ సెంటర్లలో వేచి ఉండే సమయం వంటి వివరాలను రైతులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ నంబరు ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. రైతులందరూ మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన ఈ వాట్సప్ యాప్ను ఉపయోగించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పత్తిని విక్రయించుకోవాలని రైతులను కోరారు. అలాగే, రైతులకు ఎటువంటి ఫిర్యాదులున్నా వాట్సప్ ద్వారా సమాచారమిస్తే.. మార్కెటింగ్ శాఖ సత్వరమే చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల తెలిపారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM