కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ

byసూర్య | Tue, Mar 21, 2023, 10:33 PM

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తన దూకుడును వేగవంతం చేసింది. తాజాగా ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు విచారణకు హాజరైన కవిత, నేడు మూడో దఫా ఈడీ కార్యాలయానికి వచ్చారు. గత 8 గంటలుగా ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే విచారణ మధ్యలో ఈడీ అధికారులు కవిత న్యాయబృందానికి కబురు పంపారు.   దాంతో కవిత న్యాయవాది సోమ భరత్ హుటాహుటీన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ కోరిన సమాచారానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా సోమ భరత్ వెంట బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ కూడా ఉన్నారు. ఇదిలావుంటే కవిత విచారణ నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. ఈడీ కార్యాలయం 3వ ఫ్లోర్లో కవిత విచారణ కొనసాగుతోంది.Latest News
 

తెలంగాణ యూనివర్సిటీ సెలవులు రద్దు Thu, Jun 01, 2023, 09:01 PM
ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి తలసాని Thu, Jun 01, 2023, 08:38 PM
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు 4.9 శాతం డీఏ మంజూరు Thu, Jun 01, 2023, 07:54 PM
పెద్దల్ని ఒప్పించి ప్రేమ పెళ్లి,,,రాజ్‌తో ట్రాన్స్ జెండర్ అంకిత పెళ్లి Thu, Jun 01, 2023, 04:52 PM
మండిపోతోందని.... బీర్లు బాగా తాగేశారు Thu, Jun 01, 2023, 04:52 PM