మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్

byసూర్య | Fri, Jul 26, 2024, 10:02 PM

హైదరాబాద్ పోలీసులు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే.. చివరి ఆదివారం రోజున నగరంలో మహంకాళీ బోనాల సంబురం కన్నుల పండువగా జరగనుంది. అత్యంత వైభవంగా జరగనున్న ఈ బోనాల వేడుకల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. మద్యం షాపులు మూసేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.


మహంకాళీ బోనాల పండుగ ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా.. నాన్ ప్రొప్రయిటరీ క్లబ్‌లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్‌లతో సహా అన్ని వైన్స్ షాపులు జులై 28న మూసివేయాలని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. జూలై 28 ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు వైన్స్ షాపులతో పాటు బార్లు, కళ్లు దుకాణాలు కూడా మూసేయ్యాలని ఆదేశించారు.


సౌత్ ఈస్ట్ జోన్‌లో చాంద్రాయణగుట్ట, బండ్లగూడ ప్రాంతాల్లో ఆదివారం (జులై 28న) ఉదయం 6 గంటల నుంచి జులై 29న ఉదయం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. ఇక సౌత్ జోన్‌లో చార్మినార్, కమాటిపురా, హుస్సేనీ ఆలం, ఫలక్‌నుమా, మొఘల్‌పురా, ఛత్రినాక, షాలిబండ, మీర్‌చౌక్ ప్రాంతాల్లో జూలై 28 ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.


  బోనాల నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు బంద్ ఉండటంతో.. మద్యం ప్రియులు ముందస్తు జాగ్రత్త పడుతున్నారు. అసలే ఆషాడం చివరి వారం అందులోనూ మహాంకాళీ బోనాలు కావటంతో.. నగరవాసులు బంధుమిత్రుందరినీ పిలిచి పెద్దఎత్తున దావత్‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. దావత్ అంటే చుక్క, ముక్క ఉండాల్సిందే. ఈ నేపథ్యంలోనే వైన్స్ బంద్ ఉండటంతో.. ముందుగానే సరుకు తీసుకుని జాగ్రత్తపడుతున్నారు. దీంతో.. వైన్స్ దుకాణాల ముందు మద్యం ప్రియులు సందడి నెలకొంది.



Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM