యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు

byసూర్య | Tue, Mar 21, 2023, 10:33 PM

ఇటీవల యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా పెరిగిపోవడంతో వివాదాలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇదిలావుంటే మూడేళ్ల నాటి ఫొటోలతో తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి తనపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లపై టాలీవుడ్ నటి హేమ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడేళ్ల కిందట పెళ్లి రోజు వేడుకల సందర్భంగా భర్తతో ఉన్న ఫొటోలను ఇప్పుడు మరోసారి పోస్టు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని హేమ ఆరోపించారు. దీనిపై తాను న్యాయపోరాటం చేసేందుకు కూడా వెనుకాడడని స్పష్టం చేశారు. 


సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేసే యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. కొందరు సినీ ప్రముఖులు బతికే ఉన్నప్పటికీ, వారు చనిపోయారంటూ డబ్బుల కోసం అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఉదాహరణగా కోట శ్రీనివాసరావు అంశాన్ని ప్రస్తావించారు. కోట ఇక లేరంటూ తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించారు.



Latest News
 

తెలంగాణ యూనివర్సిటీ సెలవులు రద్దు Thu, Jun 01, 2023, 09:01 PM
ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి తలసాని Thu, Jun 01, 2023, 08:38 PM
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు 4.9 శాతం డీఏ మంజూరు Thu, Jun 01, 2023, 07:54 PM
పెద్దల్ని ఒప్పించి ప్రేమ పెళ్లి,,,రాజ్‌తో ట్రాన్స్ జెండర్ అంకిత పెళ్లి Thu, Jun 01, 2023, 04:52 PM
మండిపోతోందని.... బీర్లు బాగా తాగేశారు Thu, Jun 01, 2023, 04:52 PM