పెంచిన గ్యాస్ ధరలపై భగ్గుమన్న జనం

byసూర్య | Thu, Jul 07, 2022, 03:17 PM

 పెంచిన గ్యాస్‌ ధరలపై ప్రజలు భగ్గుమన్నారు. పెరిగిన గ్యాస్ ధ‌ర‌లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు తెలంగాణ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది.అన్ని మండ‌ల‌, ప‌ట్టణ కేంద్రాల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిర‌స‌న కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. గ్యాస్ స్టవ్‌లపై కట్టెలు పెట్టి మోదీ ప్రభుత్వం పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోదీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పలు చోట్ల మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు.పేదలకు పెను భారంగా మారిన పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిర‌స‌న కార్యాక్రమాల్లో పాల్గొన్నారు.


Latest News
 

బాబుతో సహా వివాహిత అదృశ్యం Tue, May 07, 2024, 05:16 PM
నర్సరీ, జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ Tue, May 07, 2024, 05:14 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన డిఎస్ఓ Tue, May 07, 2024, 05:13 PM
ప్రియుడితో కలిసి భర్త మర్మాంగంపై దాడి చేసి హత్య Tue, May 07, 2024, 05:10 PM
స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. కేతేపల్లికి 'వార్నింగ్' Tue, May 07, 2024, 05:09 PM