గర్భం దాల్చిన వారు తీసుకోవలసిన జాగర్తలు

byసూర్య | Tue, Nov 23, 2021, 01:10 PM

గర్భం వచ్చాక కొంత మందికి  వారి అలవాట్లను , పద్దతులను ఎలా పాటించాలో తెలియదు . మాములుగా ఉన్నట్టు ఉంటూ ఉంటారు కానీ , మారుతున్న పరిస్థితుల వలన మరియు తీసుకొనే ఆహరం వలన కొన్ని పాటించక తప్పదు. ఇంట్లో, ఆఫీసుల్లో  పనులపై మనస్సు లగ్నం చేయడం, బిడ్డ ఎదుగుదలపై దృష్టి పెట్టకపోవడం, ఇన్‌ఫెర్టిలిటి చికిత్సలతో ప్రీమెచ్యూర్‌ బేబీ ప్రసవాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఒత్తిళ్ల వల్ల,మెదడు స్థిరత్వం లేక గర్భంలో ఉండే శిశువు ఎదుగుదలకు అడ్డుపడుతుందని వైద్యులు చెపుతున్నారు . గర్భిణుల్లో ఈ సమస్యలు వలన వచ్చే ఫలితం  నెలల నిండని శిశువులు, తక్కువ బరువు ఉంటే బిడ్డలు జన్మిస్తారని పేర్కొంటున్నారు.
గర్భిణులకు ఒత్తిడితోపాటు మధుమేహం, బీపీ వంటి సమస్యలు తోడైతే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. వారు తీవ్రమైన ఒత్తిళ్లకు గురైతే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్‌ హైపర్‌టెన్షన్‌కు దారి తీస్తుంది. హైపర్‌టెన్షన్‌ వల్ల రక్తప్రసరణలో ఆటంకాలు ఏర్పడి బిడ్డ ఎదుగుదల తగ్గుతుంది . కొందరికి బీపీ వల్ల ఫిట్స్‌ రావడం కూడా జరుగుతుంది . కొంతమంది మహిళలకు గర్భిణి సమయంలో మధుమేహం ఉంటోంది. ప్రసవం తరువాత ఇది కనిపించదు.
గర్భిణుల్లో మధుమేహం తీవ్ర స్థాయిలో ఉంటే అది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. థైరాయిడ్‌, హైపర్‌టెన్షన్‌, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌, వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల ప్రీ మెచ్యూర్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న మహిళలకు పుట్టబోయే బిడ్డ ఎదుగుదల, బరువుపై  ఆ ప్రభావం పడే అవకాశముంది జాగర్త వహించండి.రక్తస్రావం ఎక్కువగా జరిగే గర్భిణులకు  పుట్టే బిడ్డ తక్కువ బరువుతో పుట్టే ప్రమాదముంది. ఇన్‌ఫెక్షన్‌ రావడం వలన కూడా  బిడ్డ తక్కువ బరువు  ఉండడం లేదా నెలలు నిండకుండా పుట్టే అవకాశముంటుంది. ఆధునిక చికిత్సతో ప్రీమెచ్యూర్‌ బేబీలలో 70 శాతం మందిని బతికించడానికి అవకాశముంది.  తక్కువ బరువు (500 గ్రాములు ) తో  పుట్టిన శిశువులకు చికిత్స ద్వారా వారి బరువు పెంచే ఆధునిక సదుపాయాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. థైరాయడ్ ఉన్న ఆడవారు ఈ సమయంలో చాల జాగర్తగా ఉండాలి అలానే ప్రసవం సమయంలో ఎక్కువగా ఆలోచించడం , భయపడటం , ఆవేశపడటం లాంటివి చెయ్యకూడదు దాని వలన ఆ సమయంలో బీపీ స్థిరంగా లేకపోవడం వలన మీరు కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది .
 అలానే తీసుకొనే ఆహరం అనేది తాజా కాయగూరలు , ఆకుకూరలు మరియు ఫండ్లకు సంబంధించి ఉండాలి . దీని వలన మీ శరీరంలో మంచిగా రక్తప్రసరణ జరిగి , బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది .  అలానే నెలకు ఒకసారైనా వైద్యుడిని సంప్రదించి తల్లి బిడ్డ పరిస్థితులు తెలుసుకోవాలి. వారి సూచనల మేరకు మందులు వాడటం మంచిది . 


Latest News
 

జహీరాబాద్ లో కాంగ్రెస్ నాయకుల ప్రచారం Sat, May 04, 2024, 03:45 PM
బిఐఎఫ్ఆర్ నుండి సింగరేణిని కాపాడింది కాంగ్రెసే: జనక్ Sat, May 04, 2024, 03:44 PM
పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీజేపీ యువ నాయకులు ప్రచారం Sat, May 04, 2024, 03:38 PM
వడదెబ్బతో రైతు మృతి Sat, May 04, 2024, 03:27 PM
ఓటు హక్కు వినియోగించుకోవాలి: మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ Sat, May 04, 2024, 03:20 PM