ఆహ్లాదకరంగా నిద్ర పట్టాలి అంటే .... అదిరిపోయే చిట్కాలు

byసూర్య | Tue, Nov 23, 2021, 01:12 PM

నిద్ర . ఇది  మనిషి జీవన శైలిలో అర్థ భాగం అని చెప్పాలి . రోజుకి పగలు , రాత్రి ఎలాగ  ఉన్నాయో అలానే మనిషికి నిద్ర , ఆహరం , పని అలానే అని భావించాలి . నిద్ర సరిగ్గా లేని వాళ్లకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది . మనిషి రోజుకి 8 గంటల నిద్రపోవాలి అని చూచిస్తున్నారు నిపుణులు . కనీసం 6 గంటలకు తగ్గకుండా దీనిని చూసుకోవాలి  లేకుంటే ప్రమాదమే .
ఐతే కొంతమందికి కుదరక నిద్రపోలేరు కానీ కొంత మంది కుదిరినా కానీ నిద్ర పట్టక నిద్రపోలేరు . నిద్రపట్టక పోయిన వారికి ఏమి  చేస్తే నిద్ర పడుతుందో ఇప్పుడు  చూద్దాం . నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్‌ ఫోన్‌ చూడటం మానేయాలి. అంతేకాదు, రాత్రిళ్లు తల పక్కన మొబైల్‌ పెట్టుకుంటే రేడియేషన్‌ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్‌ను దూరంగా పెట్టడం మంచిది. చేతివేళ్లతో లేదా దువ్వెనతో తలవెంట్రుకలను మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి.  రాత్రి పూట కాసిని గోరువెచ్చని పాలు తాగాలి.  సంగీతాన్ని పెట్టుకొని ప్రశాంతంగా కళ్లు మూసుకుని ఆలపించడం వలన తొందరగా నిద్ర పడుతుంది.
గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి.
 చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవడం , పడుకునేముందు అరికాళ్లకు ఏదైనా నూనెతో మర్దన చేసుకోవడం , రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని  మనసుకి నచ్చిన వాటిని ఊహించుకుంటూ ఉండటం ద్వారా కూడా మంచి నిద్ర పొందుతారు .
నిద్రపోయేముందు స్నానం చెయ్యడం ,  తిన్న వెంటనే పడుకోకపోవడటం , అనవసర  విషయాల గురించి ఎక్కువగా అలోచించి మానసిక ఒత్తిడికి లోను అవ్వడం లాంటివి  పక్కన పెట్టండి .


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM