ప్రీమెచ్యూర్ చైల్డ్  (అకాల శిశువు) పుట్టానికి కారణాలు చాల ... అందుకు తీసుకోవలసిన జాగర్తలు  ఇవిగో ..

byసూర్య | Tue, Nov 23, 2021, 01:06 PM

నెలలు నిండినా  తక్కువ బరువు, నెలలు నిండకుండా పిల్లలు (ప్రీమెచ్యూర్‌) పుట్టి పురిటిలో చనిపోవడం చాల సందర్భాలలో చూస్తున్నాం . ముఖ్యంగా గర్భంలో  శిశువు ఉన్నప్పుడు ఎదుగుదలకు ఒత్తిడి కీలకంగా మారుతోంది. ఆ ఒత్తిడి అనేక పరిణామాలకు దారితీసి బిడ్డ జననానికి శాపంగా మారుతోంది. ఆఫీసు, ఇంట్లో పని వత్తిళ్ళ  వలన  కొందరు గర్భిణులు పుట్టబోయే బిడ్డలపై శ్రద్ధ చూపలేక  పోతున్నారని వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ వయస్సులో  లేదా  ఆలస్యంగా వివాహాలు చేసుకుంటే నెలలు పూర్తి కాకుండా, తక్కువ బరువుతో పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది. 20ఏళ్ల లోపు, 30నుంచి 35 ఏళ్లు దాటిన తర్వాత పిల్లల ప్రసవం విషయంలో కాస్త ఆలోచించాలి. మీకు దగ్గరివారైన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనిస్తే మీరు కూడా ప్రీమెచ్యూర్ లేబర్ ని ఎక్స్పీరియెన్స్ చేయవలసిన సూచనలు కలవు. మీరు ప్రీమెచ్యూర్ బేబీ అయితే, ప్రీమెచ్యూర్ బేబీని డెలివరీ చెసే ప్రమాదం కూడా ఎక్కువే. మీ వైద్యునికి ఈ విషయానికి సంబంధించిన ఫ్యామిలీ హిస్టరీని తెలియచేస్తే తగిన సూచనలు మీకు అందుతాయి.
గర్భిణీలు ప్రశాంతంగా ఉండాలి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఈ విషయాన్నే పెద్దవాళ్లు పదే పదే గుర్తుచేస్తూ ఉంటారు. దీనికొక కారణం ఉంది, శరీరం ఒత్తిడికి గురయినప్పుడు ఎపినెఫ్రాయిన్ మరియు కార్టీసాల్ లు ఉత్పత్తి అవుతాయి. ఇది కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ను ప్రేరేపిస్తాయి. ఈ హార్మోన్ అనేది ప్రోస్టాగ్లాండిన్స్ మరియు ఇస్ట్రియల్ స్థాయిలను పెంచుతాయి. ఇవన్నీ ప్రీమెచ్యూర్ బర్త్ కి దారితీస్తాయి. ప్యానిక్ వలన కలిగే ఇంఫ్లేమేషన్ కూడా ప్రెగ్నెన్సీ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అందువలన ప్రీ టర్మ్ లేబర్ కి దారితీయవచ్చు. అందువలన, శరీరంలో పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. ఇవన్నీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వలన ఏర్పడతాయి.. సాధారణంగా  38 నుంచి 40 వారాలలోపు శిశువు జన్మిస్తారు. 23నుంచి 38 వారాల మధ్య జన్మించే శిశువును ప్రీమెచ్యూర్‌ బేబీగా పరిగణిస్తారు. 34 నుంచి 36 వారాల మధ్య జన్మించే శిశువుకు చికిత్స అందించి  త్వరగా ఆరోగ్యవంతులను చేయవచ్చు.
 ప్రీమెచ్యూర్‌ అని తెలియగానే ప్రసవానికి ముందే గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి. ముందునుంచే మెరుగైన మెడికేషన్‌ చేయడం వల్ల పిల్లలకు  ముందు రోజుల్లో వచ్చే ఆరోగ్య సమస్యలను అదిగమించవచ్చు. 26 వారాలకే ఉమ్మనీరు పోతుంటే ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసి, మెరుగైన చికిత్స ద్వారా త్వరగా ప్రసవాన్ని నివారించి ప్రీమెచ్యూర్‌ జరగకుండా చూడొచ్చు. ప్రీమెచ్యూర్‌ బేబీ పుట్టిన మొదటి నిమిషం నుంచి వైద్యులు చికిత్సలు అందించాలి. టెంపరేచర్‌, శ్వాస సమస్య, గుండె పనితీరును నిరంతరం పర్యవేక్షించాలి. ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, పేగులు సున్నితంగా ఉంటాయి. మెద డు రక్తనాళాలు సన్నగా ఉంటాయి. దీనికి తోడు పుట్టగానే పిల్లలు ఈ వాతావారణానికి అలవాటు పడలేరు. వారిలో ఊపిరితిత్తులు, గుండె తదితర అవయవాలు తయారైనప్పటికీ పనితీరు అంతగా ఉండదు. ఆఖరి వారంలోనే గర్బంలోని శిశువు అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది. 30 నుంచి 40 వారాలలో పిల్లల ఎదుగుదల బాగా ఉంటుంది.
 ప్రీమెచ్యూర్‌ బీబీ 1.5 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నా, శ్వాస ఇబ్బందులు ఉన్నా ఇంక్యుబేటర్‌లో పెట్టి చికిత్స అందించాలి. కొంతమందికి వార్మర్‌లో చికిత్సలు అందించాలి. ఇన్‌ఫెక్షన్‌ రాకుండా యాంటిబయాటిక్‌, బ్లడ్‌ పరీక్షలు, గుండె పనితీరు, ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌, మూత్ర విసర్జనను పరిశీలించాల్సి ఉంటుంది. బ్రెయిన్‌ స్కాన్‌ వంటివి చేయాల్సి ఉంటుంది. ప్రీమెచ్యూర్‌ బేబీకి తల్లి పాలు తప్పని సరిగా ఇవ్వాలి. దీని వల్ల క్రమంగా బరువు పెరుగుతారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM