3గ్రాముల కొకైన్ పట్టివేత

byసూర్య | Tue, Jun 18, 2019, 08:44 AM

బెంగుళూరు కేంద్రంగా నగరంలో కొకైన్ విక్రయాలకు పాల్పడుతున్న టాంజానియా దేశస్తుడిని హైదరాబాద్ జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. జిల్లా ఏఈఎస్ నంద్యాల అంజిరెడ్డి కథనం ప్రకారం...బెంగుళూరు కేంద్రంగా ఇమాన్యుయల్ అలియాస్ లెవల్ వద్ద నుంచి టాంజానియా దేశానికి చెందిన జాన్‌పాల్ ఎంబెల్(29) కొకైన్ కొనుగోలు చేసి నగరంలోని వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో జాన్‌పాల్ లంగర్‌హౌస్‌లో కొకైన్‌ను విక్రయించేందుకు యత్నిస్తుండగా సమాచారం అందుకున్న ఆబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 3గ్రాముల కొకైన్‌తో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును గోల్కొండ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.


Latest News
 

హైదరాబాద్-విజయవాడ వెళ్లే బస్సు ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బంపరాఫ Mon, Apr 29, 2024, 08:05 PM
4 నెలులుగా జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. ఇదిగో అసలు నిదర్శనం: కేసీఆర్ Mon, Apr 29, 2024, 08:01 PM
కేసీఆర్ నిజస్వరూపం ఎవ్వరికీ తెలియదు.. 3 నెలల్లో అద్భుతం జరగబోతోంది: కడియం శ్రీహరి Mon, Apr 29, 2024, 07:56 PM
సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు.. మే 1న విచారణకు రావాలని ఆదేశాలు Mon, Apr 29, 2024, 07:43 PM
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే సీఎం అయ్యే అర్హత ఉందని అందుకే అన్నా.. రేవంత్ రెడ్డి క్లారిటీ Mon, Apr 29, 2024, 07:38 PM