కేసీఆర్ నిజస్వరూపం ఎవ్వరికీ తెలియదు.. 3 నెలల్లో అద్భుతం జరగబోతోంది: కడియం శ్రీహరి

byసూర్య | Mon, Apr 29, 2024, 07:56 PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న కడియం శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయాలని మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చూస్తున్నారని కడియం శ్రీహరి తెలిపారు.


పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి మధ్యే పోటీ ఉందని.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కదంటూ శ్రీహరి తెలిపారు. ముందునుంచి వరంగల్ అంటే కేసీఆర్‌కు ఒకరకమైన వివక్ష అని.. ఇక్కడ ప్రశ్నించే వాళ్లు, ఉద్యమించే వాళ్లు ఎక్కువగా ఉంటారని అందుకే వాళ్ల గొంతునొక్కాలన్న కుట్రతో ఆరు ముక్కలు చేశారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ నిజస్వరూపం ఎవ్వరికీ తెలియదని.. లోపల ఎన్నో కుట్రలు పెట్టుకుని బయటకు మాత్రం వేరేలా కనిపిస్తారంటూ కడియం చెప్పుకొచ్చారు.


ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిని తీసుకువచ్చి ఎంపీగా పోటీ చేపిస్తున్నారని కడియం చెప్పుకొచ్చారు. అయితే.. రాబోయే 3 నెలల్లో రాష్ట్రంలో అద్భుతం జరుగనుందని శ్రీహరి తెలిపారు. మూడు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్ అని.. పదేళ్లలో హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాలు కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్ల మీద, బినామీల పేర్ల మీదికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అధికారులను లొంగదీసుకుని, భూయజమానులను బెదిరించి వేల ఎకరాలను కబ్జా చేశారని తెలిపారు.


ఫోన్ ట్యాపింగ్ కేసులు, లిక్కర్ స్కాం కేసులను కేసీఆర్ కుటుంబం ఎదుర్కొంటుందని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. కవిత నిర్దోషి అయితే ఎందుకు బెయిల్ దొరకడం లేదు అని కేసీఆర్‌ని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, బీజేపీకి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని.. అందులో భాగంగానే తాటికొండ రాజయ్యకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. కడియంను తిట్టడానికే రాజయ్యను కేసీఆర్ జీతానికి పెట్టుకున్నాడని మండిపడ్డారు. భూకబ్జాలు చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు వదిపెట్టొద్దని కడియం శ్రీహరి తెలిపారు.


Latest News
 

ఏపీలో గెలుపు జగన్‌దే.. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక్కటే ఎంపీ సీటు: కేటీఆర్ Wed, May 15, 2024, 11:23 PM
రిగ్గింగ్ జరిగింది.. రీపోలింగ్‌కు ఎంత దూరమైనా వెళ్తా: మాధవీలత Wed, May 15, 2024, 11:18 PM
ఇదేం దరిద్రపు అలవాటు తల్లి.. అర్థరాత్రి శబ్దాలు, ఏంటా అని లేచి చూస్తే షాకింగ్ విషయం వెలుగులోకి Wed, May 15, 2024, 08:37 PM
అసెంబ్లీ ఎన్నికలకు మించి పోలింగ్.. కసిగా ఓటేశారు, అదే జరగబోతోందా Wed, May 15, 2024, 08:30 PM
తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు Wed, May 15, 2024, 08:25 PM