4 నెలులుగా జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. ఇదిగో అసలు నిదర్శనం: కేసీఆర్

byసూర్య | Mon, Apr 29, 2024, 08:01 PM

తెలంగాణలో ఓవైపు లోక్ సభ ఎన్నికల జోరు నడుస్తుంటే.. మరోవైపు కరువు రక్కసి కూడా మెల్లగా కోరలు చాస్తోంది. ఎండలు దంచికొడుతుంటే.. కరెంట్ కోతలు, నీటి కష్టాలతో జనం అల్లాడిపోతున్నారు. ఇప్పటికే.. రాష్ట్రవ్యాప్తంగా సాగు నీటి కొరతతో పంటలు ఎండిపోయి రైతులు రోడ్డెక్కారు. ఇప్పుడు తాగు నీటి కొరత కూడా ఏర్పడటంతో తాగేందుకు నీళ్లు లేక జనాలు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఈ నీటి కొరత.. తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ నీటి కష్టాలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చేరటంతో విద్యార్థులు ఆందోళనకు దిగి.. యాజమన్యంపై ఒత్తిడి తీసుకొచ్చారు.


అయితే.. వెయ్యి మంది వరకు ఉన్న హాస్టల్‌కు కేవలం ఒక్క ట్యాంకర్ తీసుకొచ్చి చేతులు దులుపుకుందామనుకుంటే.. విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆందోళన చేయగా.. మొత్తానికే చేతులెత్తేశారు. నీళ్లు లేని కారణంగా.. మే 1వ తేదీ నుంచి హాస్టళ్లు, మెస్సులు మూసేయాలని ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు ఇప్పుడు రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూడా.. ట్విట్టర్ వేదికగా స్పందించారు.


రాష్ట్రంలో విద్యుత్, సాగు, తాగునీటి సరఫరాపై గత 4 నెలలుగా తెలంగాణ ప్రజలను సీఎం, డిప్యూటీ సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యుత్, తాగు, సాగునీటి ఎద్దడి ఉన్న మాట వాస్తవమన్నారు. ఎక్కడా విద్యుత్ కోతలు, నీటి కొరత లేదంటూ ప్రభుత్వం చెప్తున్న మాటలు పూర్తిగా అబద్ధమని.. అందుకు ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ నోటీసులే నిదర్శనమన్నారు. ఈ మేరకు కేసీఆర్ ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు.. యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసుతో పాటు 


ఇప్పటికే.. నీటి ఎద్దడితో పంటలు ఎండిపోయాయని రైతులు రోడ్డెక్కగా.. కేసీఆర్ స్పందించి పొలం బాట పేరుతో అన్నదాతలను పరామర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కృత్రిమ కరువు సృష్టించిందని దుయ్యబట్టారు. తాము అధికారం నుంచి దిగిపోయిన వెంటనే బటన్ బంద్ చేసినట్లుగా విద్యుత్ కోతలు మొదలయ్యాయంటూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ట్విట్టర్‌లో అడుగుపెట్టిన కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వమే లక్ష్యంగా వరుస ట్వీట్లు చేస్తున్నారు.


తొలిరోజే.. "తెలంగాణలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ పర్యటనలో ఉండగా భోజనం చేస్తున్నంతసేపట్లో రెండు సార్లు కరెంటు పోయింది. కానీ ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది..? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి" అంటూ ట్వీట్ చేశారు.


Latest News
 

రాజీవ్ రహదారి పై రోడ్డు ప్రమాదం Thu, May 16, 2024, 10:40 AM
ఏపీలో గెలుపు జగన్‌దే.. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక్కటే ఎంపీ సీటు: కేటీఆర్ Wed, May 15, 2024, 11:23 PM
రిగ్గింగ్ జరిగింది.. రీపోలింగ్‌కు ఎంత దూరమైనా వెళ్తా: మాధవీలత Wed, May 15, 2024, 11:18 PM
ఇదేం దరిద్రపు అలవాటు తల్లి.. అర్థరాత్రి శబ్దాలు, ఏంటా అని లేచి చూస్తే షాకింగ్ విషయం వెలుగులోకి Wed, May 15, 2024, 08:37 PM
అసెంబ్లీ ఎన్నికలకు మించి పోలింగ్.. కసిగా ఓటేశారు, అదే జరగబోతోందా Wed, May 15, 2024, 08:30 PM