యూట్యూబర్ హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్.. హైకోర్టు కీలక తీర్పు.. పరారీలో ఉండగానే..!

byసూర్య | Wed, Oct 30, 2024, 08:15 PM

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న యూట్యూబర్ హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తెలుగు బిగ్ బాస్‌‌తో ఫేమస్ అయిన ఓ నటి ఇచ్చిన ఫిర్యాదుతో హర్షసాయిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. తనపై కేసు నమోదైనప్పటి నుంచి హర్షసాయి పరారీలోనే ఉన్నాడు. హర్షసాయిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అయితే.. హర్షసాయి మాత్రం తన లాయర్లతో.. ముందస్తు బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే.. హర్షసాయికి హైకోర్టులో భారీ ఊరట లభించింది.


లైంగిక వేధింపులు చేసినట్టుగా తనపై పెట్టిన కేసు చెల్లదని.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హర్షసాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ మీద బుధవారం (అక్టోబర్ 30న) విచారణ జరిపారు. పిటిషనర్ తరపు లాయర్ వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. హర్ష సాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.


ఇదిలా ఉంటే.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు బాధితురాలు సిద్దమైనట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లైంగికంగా వేధించాడని.. ఏకంతంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడినట్టు బాధితురాలు ఆరోపించింది. తన దగ్గర రూ.2 కోట్లు కూడా తీసుకున్నాడని ఆరోపిస్తూ.. సెప్టెంబర్ 24న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేవలం హర్షసాయి మీదే కాదు.. అతడి తండ్రి‎ మీద కూడా బాధితురాలు కంప్లైంట్ చేయటం గమనార్హం.


పోలీసులు కేసు నమోదు చేసినప్పటినుంచి ఇప్పటికి కూడా హర్షసాయి అండర్ గ్రౌండ్‌లోనే ఉన్నాడు. అయితే.. ఇప్పుడు ముందస్తు బెయిల్ మంజూరైన నేపథ్యంలో.. ఇప్పటికైనా హర్షసాయి అజ్ఞాతం వీడతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా ఈ విషయంపై ఓ క్లారిటీ ఇస్తారా.. లేదా అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారగా.. ఈ కేసులో రాను రాను ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఒకవేళ బాధితురాలు.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తే.. కేసు మరో మలుపు తిరిగే అవకాశం కూాడా ఉందన్న చర్చ జరుగుతోంది.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM