byసూర్య | Wed, Oct 30, 2024, 08:13 PM
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం.. 24 మందితో కొత్త పాలకమండలి సభ్యుల పేర్లను వెల్లడించింది. ఇందులో టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడుకు అవకాశం కల్పించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతోపాటు మరో 23 మంది పాలక మండలి సభ్యుల పేర్లతో జాబితాను టీటీడీ అధికారికంగా విడుదల చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు
బీఆర్ నాయుడు- టీటీడీ ఛైర్మన్
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే) - టీటీడీ సభ్యులు
ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే) - టీటీడీ సభ్యులు
ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే) - టీటీడీ సభ్యులు
పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి) - టీటీడీ సభ్యులు
సాంబశివరావు (జాస్తి శివ) - టీటీడీ సభ్యులు
శ్రీసదాశివరావు నన్నపనేని - టీటీడీ సభ్యులు
కృష్ణమూర్తి - టీటీడీ సభ్యులు
కోటేశ్వరరావు - టీటీడీ సభ్యులు
మల్లెల రాజశేఖర్ గౌడ్ - టీటీడీ సభ్యులు
జంగా కృష్ణమూర్తి - టీటీడీ సభ్యులు
దర్శన్. ఆర్.ఎన్ - టీటీడీ సభ్యులు
జస్టిస్ హెచ్ఎల్ దత్ - టీటీడీ సభ్యులు
శాంతారామ్ - టీటీడీ సభ్యులు
పి.రామ్మూర్తి - టీటీడీ సభ్యులు
జానకీ దేవి తమ్మిశెట్టి - టీటీడీ సభ్యులు
బూంగునూరు మహేందర్ రెడ్డి - టీటీడీ సభ్యులు
అనుగోలు రంగశ్రీ - టీటీడీ సభ్యులు
బురగపు ఆనందసాయి - టీటీడీ సభ్యులు
సుచిత్ర ఎల్లా - టీటీడీ సభ్యులు
నరేశ్‌కుమార్ - టీటీడీ సభ్యులు
డా.అదిత్ దేశాయ్ - టీటీడీ సభ్యులు
శ్రీసౌరబ్ హెచ్ బోరా - టీటీడీ సభ్యులు
ఇక ఈ టీటీడీ పాలకమండలి సభ్యుల్లో సగానికి పైగా ఇతర రాష్ట్రాల వారే ఉండటం గమనార్హం. తెలంగాణ నుంచి ఐదుగురు సభ్యులకు అవకాశం కల్పించగా.. కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి రెండు.. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికీ టీటీడీ పాలకమండలిలో చోటు దక్కింది.