byసూర్య | Wed, Oct 30, 2024, 06:19 PM
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలో, లైసెన్సు కలిగిన వారు మాత్రమే, ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి బాణాసంచా విక్రయాలు చేయాలని గూడూరు సిఐ, కె. బాబురావు తెలిపారు. బాణసంచా నిలువలు, తయారీ, విక్రయాలకు అనుమతులు తప్పనిసరిగా, ప్రభుత్వ నిబంధనలకు లోబడి విక్రయాలు చేపట్టాలి. తమ ఇష్టానుసారంగా, అనుమతులు లేకుండా, బాణసంచా సామాగ్రి అమ్మితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ కె బాబురావు అన్నారు.
గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో అక్రమంగా బాణాసంచా తయారీ, సరఫరా, విక్రయా లు చేసే వారిపై, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా జన సంచార స్థలాల్లో విక్రయించిన, కఠిన చర్యలు తప్పవని అన్నారు. లైసెన్సు అనుమతులు పొందిన వారు, రామ్ లీలా మైదానం అంగడి ప్రాంగణంలో, బాణ సంచాలను విక్రయించాలని అన్నారు. షాపులు అనుమతులు లేకుండా విక్రయాలు జరిపిన, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని గూడూరు సిఐ, కె. బాబురావు అన్నారు.