విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా టీచర్లు ప్రొత్సహించాలి

byసూర్య | Wed, Oct 30, 2024, 06:14 PM

విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే చెకుముఖి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌లకు జిల్లాలోని8,9,10 తరగతుల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా విద్యార్థులను ప్రోత్సాహించాలని జిల్లా పీఆర్‌టీయు అధ్యక్షుడు ఎ.మాణయ్య కోరారు. సోమవారం జోగిపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో చెకుముఖి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ 2024 వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  జన విజ్ఞాన వేదిక  విద్యార్థులలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుటలో భాగంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా చేకు ముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. జె. వి. వి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదరులు బాలయ్య , సాయితేజలు మాట్లాడుతూ  టెస్ట్‌లను  పాఠశాల, మండల స్థాయి, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో దశల వారీగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జోగిపేట పట్టణ పీఆర్‌టీయు అధ్యక్షుడు ఎస్‌ నరోత్తమ్‌ కుమార్‌  మాట్లాడుతూ మండలంలో గతంలో రాష్ట్ర స్థాయి వరకు విద్యార్థులు ఎంపికై మండలానికి పేరు వచ్చేలా చేసిన మండల ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. పరీక్ష నిర్వాహకులు వి మహేష్‌ కుమార చారి, వి వీరేశంలు మాట్లాడుతూ మండల విద్యాధికారి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పరీక్షలు విజయవంతం కావడానికి సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు త్రినాథ్‌ రావు, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు శ్రీ మంజ్యా నాయక్,అనిల్‌ కుమార్,రాష్ట్ర ఉపాధ్యక్షులు చంటి చంద్రశేఖర్, వి మహేష్‌ కుమార చారి,జిల్లా ఉపాధ్యక్షులు ఎ చంద్రశేఖర్, రమేష్,మండల ఉపాధ్యక్షులు వి వీరేశం,ఉపాధ్యాయులు అమత,సరిత,కిషన్, లక్ష్మన్‌ ఎంఆర్‌సీ  విష్ణు వర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM