ఓటుకు నోటు కేసుతో తెలంగాణలో చంద్రబాబును ఫినిష్ చేశాడన్న శ్రవణ్

byసూర్య | Wed, Oct 30, 2024, 05:44 PM

ఓటుకు నోటు కేసు ద్వారా తెలంగాణలో చంద్రబాబును ఫినిష్ చేసింది రేవంత్ రెడ్డేనని... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన త్వరలో భూస్థాపితం చేయడం ఖాయమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు చాలామంది సీనియర్ నాయకులను ఫినిష్ చేసిన రేవంత్... కాంగ్రెస్‌లోకి వచ్చాక ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ వంటి సీనియర్ నాయకులను ఫినిష్ చేశాడన్నారు. బీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సీఎం స్థాయిలో ఉండి కేసీఆర్‌ను ఫినిష్ చేస్తామని మాట్లాడటం ఏమిటన్నారు.కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి భస్మాసురుడిలా తయారయ్యాడన్నారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. ఆయన భాష ఇలాగే ఉంటే... ఆయన నెగిటివ్ మనస్తత్వం ఇలాగే ఉంటే... కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తారని మంత్రులు, కాంగ్రెస్ క్రియాశీలక కార్యకర్తలు, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ గుర్తించాలన్నారు. వారు ఇప్పటికైనా నిద్రలేచి రేవంత్ రెడ్డికి గడ్డి పెట్టాలని సూచించారు. "రాజ్యాంగంపై గౌరవం ఉన్నవారు ఎవరూ వాళ్లను ఫినిష్ చేస్తాం... వీళ్లను ఫినిష్ చేస్తాం" అని మాట్లాడరన్నారు. సీఎం స్థాయిలో ఉండి అలా మాట్లాడటం ఏమిటన్నారు.తెలంగాణ వ్యతిరేకులు కూడా కేసీఆర్‌ను ఫినిష్ చేస్తామని చెప్పలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇంకా ఫ్యాక్షన్‌ బుద్ధులు పోలేదన్నారు. రేవంత్ రెడ్డి కాదు... పెయింటర్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. నువ్వు ఆంధ్రా నాయకుల బూట్లు మోస్తున్నప్పుడే కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడాడని గుర్తు చేశారు. తెలంగాణ ప్రదాతపై దుర్మార్గమైన భాష మాట్లాడటం సిగ్గుచేటు... దమ్ముంటే కేసీఆర్‌తో రాజకీయంగా కొట్లాడాలని సవాల్ చేశారు.రేవంత్ రెడ్డి కూర్చుంటున్న సచివాలయం కట్టింది... ఆయన తిరుగుతున్న రోడ్లు వేసింది... తాగుతున్న నీళ్లు ఇచ్చింది కేసీఆరే అన్నారు. కేసీఆర్ కృషి వల్ల తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అయిందన్నారు. రేవంత్ రెడ్డి భాష చూస్తుంటే అసలు అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా? అనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు


Latest News
 

ఎమ్మెల్యే అధ్వర్యంలో గాంధీ నగర్‌లో బీఆర్ఎస్ నాయకుల సంబరాలు Wed, Oct 30, 2024, 08:51 PM
పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం Wed, Oct 30, 2024, 08:44 PM
హైదరాబాద్ నగర ట్రాఫిక్ విభాగంలోకి కొత్తగా హైడ్రా వాలంటీర్లు Wed, Oct 30, 2024, 08:42 PM
గొల్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ Wed, Oct 30, 2024, 08:41 PM
మహిళల భద్రతే మా ప్రధాన బాధ్యత Wed, Oct 30, 2024, 08:40 PM