నవంబర్ 1న స్థానిక సంస్థల్లో వెనుక బాటుతనం పై ప్రజాభిప్రాయ సేకరణ...... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

byసూర్య | Sat, Oct 26, 2024, 04:08 PM

నవంబర్ 1న స్థానిక సంస్థల్లో వెనుక బాటుతనం పై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని, దీనిలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, మేధావులు హాజరై వారి అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థలలో వెనుకబాటుతనం స్వభావం ప్రభావాన్ని సమకాలిన, సున్నమైన అనుభ పూర్వక విచారణను నిర్వహించేందుకు ప్రత్యేక బీసీ కమిషన్ ఏర్పాటు చేసుకోవడం.
జరిగిందని, నవంబర్ 1 న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్  ఆడిటోరియ హల్ లో ఉమ్మడి కరీంనగర్  జిల్లాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, మేధావులు కుల సంఘాలు, సంచార జాతుల  ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేయాలని, ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను, అభ్యర్థనలను రాతపూర్వకంగా  వెరిఫికేషన్ ఆఫ్ డేవిడ్ తో పాటు 6 సెట్లలో తెలుగు లేదా ఆంగ్లం ఏదైనా భాషలో తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ కి సమర్పించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


Latest News
 

మేడారంలో మినీ జాతర తేదీలు ఖరారు Sat, Oct 26, 2024, 08:45 PM
హెచ్ఆర్ బుక్ ఆవిష్కరణలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ Sat, Oct 26, 2024, 08:42 PM
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన విజేతటెక్నో విద్యార్థులు Sat, Oct 26, 2024, 08:39 PM
పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు Sat, Oct 26, 2024, 08:38 PM
మాదక ద్రవ్యాల నిర్మూలన గోడ పత్రికలు ఆవిష్కరణ Sat, Oct 26, 2024, 08:37 PM