మేడారంలో మినీ జాతర తేదీలు ఖరారు

byసూర్య | Sat, Oct 26, 2024, 08:45 PM

వనదేవతలు మేడారం సమ్మక్క సారక్క దేవతల మినీ జాతరకు తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే మినీ జాతర తేదీలను (వడ్డెలు) పూజారుల సంఘం ప్రకటించింది.మినీ జాతరకు తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖకు పూజారులు లేఖ రాశారు. తెలంగాణ కుంభమేళ మేడారం మహా జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. ఐతే మహా జాతర జరిగిన మరుసటి యేట ఆదివాసీలు పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఆదివాసీల పండుగ మినీ జాతరగా ప్రాశస్త్యంలోకి వచ్చింది.మహాజాతర తరహాలోనే మినీ జాతర కూడా నిర్వహిస్తారు. 2025 ఫిబ్రవరి మాసంలో నిర్వహించే మినీజాతరను ఫిబ్రవరి 12వ తేదీన ప్రారంభిస్తారు.13, 14, 15 తేదీలలో మొత్తం నాలుగు రోజుల పాటు మినీ జాతర నిర్వహించనున్నారు.ఐతే 2023 మినీజాతరకు దాదాపు 15 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు. మాహా జాతర సమయంలో మొక్కులు తీర్చుకోవడం వీలు పడని భక్తులు మినీ జాతర సమయంలో సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సారి నాలుగు రోజుల వ్యవధిలో 25 లక్షల మంది వరకు హాజరవుతారని అంచనాలు వేస్తున్న పూజారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖకు లేఖ ద్వారా తెలిపారు.


Latest News
 

తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM
స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటుకు కీలక ముందడుగు.. 'మెఘా' కంపెనీతో సర్కార్ ఒప్పందం Sat, Oct 26, 2024, 09:25 PM