నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

byసూర్య | Sat, Oct 26, 2024, 10:13 PM

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ యువత సత్తా చాటేలా తెలంగాణ క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ క్రీడా విధానంపై ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ విధానంలో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని చెప్పారు. మరో పది రోజుల్లోగా యంగ్ ఇండియా స్పోర్ట్ వర్సిటీకి సంబంధించిన గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలన్నారు.


అత్యుత్తమ క్రీడా విధానం కోసం ద‌క్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివ‌ర్సిటీ అనుస‌రిస్తున్న విధానాల‌ను అధ్యయనం చేయాల‌ని, ఈ రంగంలో నిపుణులు, క్రీడాకారులతో సంప్రదింపులు జరపాలని చెప్పారు. రాష్ట్ర, జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడా పోటీల‌కు సంబంధించిన క్యాలెండ‌ర్‌ను వెంట‌నే త‌యారు చేయాలన్నారు. వ‌చ్చే రెండేళ్లలో నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్‌ను సంప్రదించాల‌ని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ స‌ల‌హాదారు కే.కేశ‌వ‌రావు, క్రీడా స‌ల‌హాదారు ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఇక సౌత్ కొరియా రాజధాని సియోల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం పర్యిటిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ కొరియాలోని అత్యంత ప్రతిష్ఠాత్మక స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో ఒకటైన ఇంచియాన్ స్మార్ట్ సిటీని ప్రతినిధుల బృందం సందర్శించింది. సాంగ్డో ప్రాంతంలో దాదాపు 150 ఎకరాల్లో పర్యావరణ అనుకూల విధానాలతో అభివృద్ధి చేసిన స్మార్ట్‌ సిటీని సందర్శించారు. ఈ యూనివర్శిటీ సహకారంతో తెలంగాణలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్శిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఒలింపిక్‌ సహా ఇతర ప్రతిష్టాత్మక టోర్నీల్లో సౌత్ కొరియా సాధించే పతకాల్లో కొరియన్‌ స్పోర్ట్స్‌ వర్శిటీ వాటా దాదాపు 40 శాతం వరకు ఉంది. ఈ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలోనూ క్రీడాకారులు పతకాలు సాధించేలా యంగ్‌ ఇండియా వర్శిటీలో శిక్షణ ఇచ్చేలా కొరియన్‌ స్పోర్ట్స్‌ వర్శిటీతో తెలంగాణ ప్రతినిధుల బృందం ఒప్పందం చేసుకుంది.



Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM