హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన

byసూర్య | Sat, Oct 26, 2024, 11:43 PM

హైదరాబాద్ వాసులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ వినిపించింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్న టీజీఎస్ ఆర్టీసీ.. అటు కార్గో సేవలను కూడా విస్తరిస్తోంది. తద్వారా ప్రజలకు సేవలందించటమే కాకుండా.. సంస్థకు అదనపు ఆదాయం కూడా భారీగానే సమకూరుతోంది. అయితే.. ఇప్పటివరకు విరివిగా కార్గో పాయింట్లు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా సేవలందించిన టీజీఎస్ ఆర్టీసీ.. కార్గో ద్వారా మంచి ఫలితాలే వస్తుండటం, విశేష ఆధరణ పొందుతుండటంతో.. ఈ సేవలను మరింతగా విస్తరించేందుకు సిద్ధమైంది. కాగా.. ఇప్పుడు నేరుగా ఇంటి వద్దకే వచ్చి పార్శిళ్లు హోం డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. ఈ హోం డెలివరీ సేవల గురించి గత కొంతకాలం కింద నుంచే కసరత్తు చేస్తుండగా.. రేపటి (అక్టోబర్ 27) నుంచి ప్రారంభించనుంది. ఈ మేరకు.. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.


ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గానూ లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ మ‌రింత‌గా విస్తరిస్తోంద‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్‌లో వేగ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే.. పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌లో ఈ హో డెలివరీ సేవలను ప్రారంభించనున్నారు.


 ఆదివారం (అక్టోబర్ 27) నుంచి హైద‌రాబాద్‌లోని 31 ప్రాంతాల ద్వారా.. హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్‌లో ఎక్కడికైనా హోం డెలివ‌రీ సేవలు అందించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌ వ్యాప్తంగా ఈ హోం డెలివరీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తుండగా.. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంద‌ని మంత్రి తెలిపారు. ప్రజ‌లంద‌రూ ఈ హోం డెలివ‌రీ స‌దుపాయాన్ని వినియోగించుకోవాల‌ని మంత్రి పొన్నం ప్రభాక‌ర్ కోరారు.


పార్శిళ్ల హోం డెలివ‌రీ ఛార్జీలివే..


0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50


1 కేజీ నుంచి 5 కేజీల‌కు రూ.60


5 కేజీ నుంచి 10 కేజీల‌కు రూ.65


10 కేజీ నుంచి 20 కేజీల‌కు రూ.70


20 కేజీ నుంచి 30 కేజీల‌కు రూ.75


30 కేజీలు దాటితే.. పైన పేర్కొన్న స్లాబ్‌ల ఆధారంగా ధ‌ర‌లు ఉంటాయి.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM