పెన్షన్ దారులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మంద కృష్ణ విమర్శ

byసూర్య | Sat, Oct 26, 2024, 03:03 PM

రేవంత్ రెడ్డి కంటే చంద్రబాబు ఎంతో నయమని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అన్నారు. పెన్షన్ దారులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చేయూత పెన్షన్ తీసుకునే వారిని నట్టేట ముంచారని, వారి కోసం ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా పెన్షన్ పెంచి ఇవ్వలేదని మండిపడ్డారు.దివ్యాంగులకు పెన్షన్ పెంచి ఇవ్వాలని తాము చంద్రబాబుకు ఏప్రిల్ నెలలో వినతిపత్రం ఇస్తే, జూన్ నెలలో ఆయన అధికారంలోకి రాగానే అమలు చేశారన్నారు. కండరాల క్షీణత ఉంటే ఏపీలో రూ.15 వేలు ఇస్తున్నారని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా పెన్షన్ పెంచలేదన్నారు. పెన్షన్‌ను వెంటనే పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.నవంబర్ 1 నుంచి 16 రోజుల పాటు పెన్షన్ దారుల చైతన్య సభలు నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వం ఇవ్వకుంటే నవంబర్ 26న ఛలో హైదరాబాద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఇందిరా పార్క్ వద్ద వికలాంగుల మహాగర్జన నిర్వహిస్తామని, కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలన్నింటిని ఆహ్వానిస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు.


Latest News
 

బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న ఎర్రబెల్లి Sat, Oct 26, 2024, 06:00 PM
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం Sat, Oct 26, 2024, 05:58 PM
రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM