పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం

byసూర్య | Sat, Oct 26, 2024, 04:14 PM

జాతీయ రహదారి డివైడర్ల మధ్యలో పూల మొక్కలు నాటి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ కమిషనర్ మోహన్ తెలిపారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెట్ పల్లి పట్టణంలోని జాతీయ రహదారి డివైడర్ల మధ్యలో 100 ఫినాస్తిన్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డివైడర్ల మధ్యలో ప్రస్తుతం ఫినాయిల్ మొక్కలను నాటుతున్నామని త్వరలోనే పూల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
పట్టణ ప్రజలందరూ ఖాళీ స్థలాలలో మొక్కలను నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు, కౌన్సిలర్లు అంగడి పురుషోత్తం, బంగారు కాళ్ళ కిషోర్, డిఈ నాగేశ్వరరావు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, విజయ్, నిజాం, అశోక్, నరేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న ఎర్రబెల్లి Sat, Oct 26, 2024, 06:00 PM
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం Sat, Oct 26, 2024, 05:58 PM
రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM