బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న ఎర్రబెల్లి

byసూర్య | Sat, Oct 26, 2024, 06:00 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బాధ, ఆయనకు మద్దతుగా మరో నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మరో ఆరు నెలల్లోనే ప్రభుత్వం పడిపోయేలా కనిపిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.జనగామలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రెండు మూడు రోజుల్లో తెలంగాణలో బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారని, కానీ బాంబులు పేలేది బీఆర్ఎస్‌లో కాదన్నారు. కాంగ్రెస్ నేతలే పరస్పరం బాంబులు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. లకావత్ శ్రీను నాయక్ అనే వ్యక్తి వారం క్రితం పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీను మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనగామలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎర్రబెల్లి... శ్రీను నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


Latest News
 

గుస్సాడీ కనకరాజు అసామాన్యుడు.. ఆయన మరణం తీరని లోటు: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 07:48 PM
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల ఫోన్లు ట్యాపింగ్‌.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు Sat, Oct 26, 2024, 07:46 PM
నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలు.. హైకోర్టులో పిటిషన్ Sat, Oct 26, 2024, 07:44 PM
బాలకృష్ణకు సీఎం రేవంత్ బంపరాఫర్.. సాయంత్రం కేబినెట్ భేటీలో తుది నిర్ణయం Sat, Oct 26, 2024, 07:43 PM
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బిగ్ అప్డేట్.. వచ్చే వారంలోనే.. మంత్రి పొంగులేటి Sat, Oct 26, 2024, 07:41 PM