విద్యుత్‌ శాఖ పనితీరుపై మంత్రి దామోదర సంతృప్తి

byసూర్య | Sat, Oct 19, 2024, 04:10 PM

సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గంలో విద్యుత్‌ శాఖకు సంబంధించి మంజూరైన రూ.9 కోట్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ ఆదేశించారు. నియోజకవర్గంలో అభివృద్ది పనులకు సంబంధించి  సమీక్షా సమావేశంను హైద్రాబాద్‌లో శుక్రవారం  నిర్వహించారు. ఈ సమావేశంలో మేడ్చల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కామేష్, సంగారెడ్డి సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ శ్రీనాథ్, జోగిపేట డివిజనల్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న పనుల వేగాన్ని సమీక్షించారు.
9 కోట్ల అంచనాతో జరుగుతున్న పనుల పట్ల మంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఎఫ్‌వై 2024–2025 కోసం ప్రోగ్రామ్‌ చేయబడిన అన్ని పనులు ప్రారంభించబడ్డాయని, రాబోయే వేసవిలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. వేసవి మరియు రబీ సీజన్లలో ఆందోల్‌ నియోజకవర్గంలో విశ్వసనీయమైన విద్యుత్‌ సరఫరాను నిర్ధారించడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌), 11 కేవీ ఇంటర్‌లింకింగ్‌ లైన్‌లు  33 కేవీ సబ్‌స్టేషన్‌ల ఏర్పాటుతో సహా వ్యవసాయ మౌలిక సదుపాయాలు అత్యంత ప్రాధాన్యతగా చేపడుతున్నట్లు తెలిపారు.  వ్యవసాయ కార్యకలాపాలకు తోడ్పడటానికి ఈ ప్రాంతంలో మొత్తం విద్యుత్‌  మెరుగుపరచడానికి అవసరమైన ఈ పనులను సకాలంలో పూర్తి చేయవలసిన అవసరాన్ని మంత్రి అధికారులకు సూచించారు. గృహ, వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్‌ సరఫరాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని మంత్రి సూచించారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM