వికారాబాద్ మున్సిపాలిటీకి సమస్యలు లేని మాస్టర్ ప్లాన్ తయారు కానుంది

byసూర్య | Thu, Oct 17, 2024, 03:09 PM

వికారాబాద్ జిల్లా కేంద్రంలో లేటెస్ట్ టెక్నాలజీ, డ్రోన్ కెమెరాల సహాయంతో వికారాబాద్ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ డిజిటల్ సర్వే పకడ్బందీగా క్యాప్చర్ చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్  అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 స్కీమ్ కింద రాష్ట్రంలో 50వేల నుంచి లక్ష జనాభా కలిగిన 20 మున్సిపాలిటీలను మాస్టర్ ప్లాన్ డిజిటల్ సర్వే  చేయడం కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి వికారాబాద్ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని  ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ , సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, డిటిసిపి అధికారులతో కలిసి ప్రారంభించడం జరిగిందని చైర్ పర్సన్  తెలిపారు.
ఈ మాస్టర్ ప్లాన్ సర్వే సహాయంతో మన వికారాబాద్ పట్టణానికి కొత్తరూపు రాబోతున్నది. ఏండ్ల క్రితం రూపొందించిన ప్రణాళికలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మార్చేందుకు ఈ డిజిటల్ సర్వే చాల ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఉపగ్రహాల సాయంతో మున్సిపాలిటీల పరిధిలోని ప్రాంతాల వారీగా ఉపరితలం ఎత్తు, పరిస్థితులు, రోడ్లు, ఇండ్లు, డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు, సెల్‌ టవర్స్‌, టాయిలెట్స్‌, రిజర్వాయర్లు, మార్కెట్లు, వైకుంఠధామాలు ఇలా ప్రతిదీ చిత్రాలతో విభాగాల వారీగా సేకరించి బేస్‌ మ్యాప్‌లను తయారు చేస్తారు. దీన్ని ఆధారం చేసుకుని రాబోయే 30, 40 ఏండ్ల భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టు అధికార యంత్రాంగం కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది అన్నారు. పట్టణాల అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో ఈ బేస్‌ మ్యాప్‌లే కీలకం కానున్నాయి చైర్ పర్సన్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, సర్వే ఆఫ్ ఇండియా జాయింట్ డైరెక్టర్ భాస్కర్ చంద్ర ఫరీదా, డిటిసిపి అడిషనల్ డైరెక్టర్ రమేష్ బాబు, మున్సిపల్ ఇంచార్జి కమిషనర్ రాకేష్ రెడ్డి, టిపిఓ వేణుగోపాల్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, డిటిసిపి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM