సకాలంలో రైస్ డెలివరీ ప్రక్రియ పూర్తి చేయాలి

byసూర్య | Thu, Oct 17, 2024, 03:07 PM

ప్రభుత్వం విధించిన గడువు లోగా సకాలంలో ఖరీఫ్ 2023-24 , రబీ 2023-24  సీజన్ లకు సంబంధించి పెండింగ   రైస్ డెలివరీని  తప్పని సరిగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్యామ్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్  మిల్లర్లను ఆదేశించారు.బుధవారం అదనపు కలెక్టర్ శ్యామ్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని  తన చాంబర్ లో జిల్లాలోని రైస్ మిల్లర్లు, సంభందిత అధికారులతో  పెండింగ్ లో ఉన్న రైస్ డెలివరీపై సమీక్షించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామ్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ 2023-24, రబీ సీజన్ 2023-24 కు సంబంధించి బాకీ ఉన్న  రైస్ డెలివరీ  నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న రా రైస్ మిల్లులు వారికి కేటాయించిన ధాన్యాన్ని ప్రాసెస్ చేసి ప్రతి రోజు వాటి సామర్థ్యం మేరకు అత్యధిక ఏసికే లు డెలివరీ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. రైస్ డెలివరీ ఆలస్యం చేస్తున్న రైస్ మిల్లులను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని, రైస్ మిల్లులు పూర్తి స్థాయిలో నడుస్తూ నిర్దేశించిన గడువు లోగా  రైస్ డెలివరీ పూర్తి చేయాలని  పేర్కొన్నారు.


రైస్ డెలివరీ  గడువు పెంపు ఉండదని, నిర్దేశిత సమయంలోగా మిల్లుల వారీగా తమకు కేటాయించిన లక్ష్యం పూర్తి చేయాలని అన్నారు.బాకీ ఉన్న రైస్ మిల్లర్లు సకాలంలో మిల్లింగ్ చేసి  రైస్ అప్పగించకపోతే  మిల్లర్ల పై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్ హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

బండారు దత్తాత్రేయకు పెనుప్రమాదం Mon, Oct 21, 2024, 11:46 AM
నారాయణ కాలేజీలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం Mon, Oct 21, 2024, 11:41 AM
తెలంగాణలో మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు Mon, Oct 21, 2024, 11:14 AM
ఏఐ అంటే రేవంత్ రెడ్డి ఎనుముల ఇంటెలిజెన్స్ : కేటీఆర్ Mon, Oct 21, 2024, 10:47 AM
తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Mon, Oct 21, 2024, 10:22 AM