byసూర్య | Tue, Oct 15, 2024, 12:10 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాక మండల పరిధిలోని ధర్మారం, తొగుట వ్యవసాయ మార్కెట్ యార్డు, రాయపోల్ మండల కేంద్రంలోను, అలాగే దౌల్తాబాద్ మండల పరిధిలోని గోవిందాపూర్, దుబ్బాక రూరల్లోని అప్పనపల్లి గ్రామంలోను ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడుతూ రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు.