హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

byసూర్య | Tue, Oct 15, 2024, 11:43 AM

బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి, అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ పట్టణంలో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది.తెల్లవారుజామునుంచే.. మేఘాలతో కమ్ముకొని పోయిన నగరంలో ఒక్కసారిగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల శబ్దం తో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఎల్బీనగర్, సాగర్ ఎక్స్ రోడ్, తార్నాక, షేక్ పేట, జూబ్లీహిల్స్, లకిడికపూల్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, రామ్ నగర్, రామంతపూర్, తార్నాక, సికింద్రాబాద్, మాదాపూర్, యూసుఫ్ గూడ, మలక్ పేట, మల్కాజ్గిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.కాగా ఆల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో మరో రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో పక్క ఈ అల్పపీడనం, తుఫాను కారణంగా ఏపీలోని పలు జిల్లాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో తమిళనాడులోని కీలక పట్టణాలు చెరువులను తలపిస్తున్నాయి


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM