byసూర్య | Tue, Oct 15, 2024, 11:07 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 198 పాయింట్లు పెరిగి 82,149 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 25,172 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, HCL టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నెస్లేఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, JSW స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.