సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ ట్రైన్.. 80 శాతం సీట్లు ఖాళీ

byసూర్య | Tue, Sep 24, 2024, 09:35 PM

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఇటీవల వందే భారత్ ట్రైన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న వర్చువల్‌గా ట్రైన్ ప్రారంభించగా.. ఈనెల 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే కొత్త వందేభారత్ ట్రైన్‌లో ఆక్యుపెన్సీ ఆశించినంతగా ఉండటం లేదు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో దాదాపుగా అన్ని కోచ్‌లు ఖాళీగానే ఉంటున్నాయి. 80శాతానికి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయని.. రైల్వే అధికారులు గుర్తించారు.


ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణ, తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ ట్రైన్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తెలంగాణలోని రామగుండం, కాజీపేట, సికింద్రాబాద్ పారిశ్రామిక కేంద్రాలతో అనుసంధానించడానికి కొత్తగా ట్రైన్‌ను నడుపుతున్నారు. అయితే ఈ ట్రైన్ రెండు వైపులా రోజువారీగా 80 శాతం ఖాళీతో ట్రైన్ నడుస్తోంది. ట్రైన్ మొత్తం సామర్థ్యం 1,440 కాగా.. ఆదివారం (సెప్టెంబర్ 22) 1,200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే 88 సీట్లు ఉండే రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లలో 10 కంటే తక్కువ మంది ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్నారు.


ఇదిలా ఉండగా.. జంట నగరాల నుండి బెంగళూరు, విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ట్రైన్లు రద్దీగా ఉంటున్నాయి. ఈ ట్రైన్లలో ఆక్యుపెన్సీ రేట్లు 90-100 శాతం మధ్య ఉంటున్నాయి. సోమవారం (సెప్టెంబర్ 23) విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టిక్కెట్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో మాత్రం ప్రయాణాలకు మెుగ్గు చూపటం లేదు. ఈ ట్రైన్‌లో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లతో పాటు 18 చైర్‌కార్ కోచ్‌లు ఉంటాయి. మెుత్తం సీట్ల సామర్థ్యం 1,440 కాగా.. కాజీపేట, రామగుండం, బల్హర్షా, చంద్రాపూర్, సేవాగ్రామ్‌ రైల్వే స్టేషన్లలో స్టాపేజీ ఇచ్చారు.


ఈ ట్రైన్‌లో ఆక్యుపెన్సీ ఇలాగే కొనసాగితే కోచ్‌ల సంఖ్యను తగ్గించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత 20గా ఉన్న కోచ్‌ల సంఖ్యను 8కి తగ్గించే అవకాశం ఉంది. అప్పుడు సీట్ల సంఖ్య కూడా 500కు తగ్గిపోనుంది. కాగా, ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో ఈ ట్రైన్‌ను మంచిర్యాల, పెద్దపల్లి, కాగజ్‌నగర్‌లోనూ హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలోని ఖాజీపేట, రామగుండం స్టేషన్లలో మాత్రమే స్టాపేజీ ఉండగా.. మరో మూడు స్టేషన్లలో ఇస్తే.. ట్రైన్ ఆక్యుపెన్సీ పెరుగుతుందని స్థానికులు అంటున్నారు.


Latest News
 

ప్రజావాణి ఫిర్యాదు లపై సత్వర పరిష్కారం చూపాలి Tue, Sep 24, 2024, 10:34 PM
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన Tue, Sep 24, 2024, 10:32 PM
మినీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి Tue, Sep 24, 2024, 10:29 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Tue, Sep 24, 2024, 10:26 PM
ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ Tue, Sep 24, 2024, 10:25 PM