ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ

byసూర్య | Tue, Sep 24, 2024, 10:25 PM

జిల్లా లో ప్రజావాణి ద్వార వచ్చే దరకాస్తులను పెండింగ్  ఉంచకుండా ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కారించడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశము హాలు నందు  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డిఓ వాసు చంద్ర లతో కలిసి ప్రజల నుండి 179 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ  సందర్భంగా  జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కార దిశగా అధికారులు పనిచేయాలన్నారు.
రైతు రుణమాఫీ, భూమి సమస్యలు అధికంగా వస్తున్న క్రమంలో మండల స్థాయిలో పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. రుణ మాఫీపై వస్తున్న ఫిర్యాదుల పట్ల వ్యవసాయ అధికారులు పరిశీలించి రుణ మాఫీ కాక పోవడానికి గల కారణాలను తెలుసుకొని సమస్య పరిష్కార దిశగా పని చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం లో  జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్, ఆర్ డి ఓ వాసుచంద్ర , జిల్లా అధికారులు  తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ప్రజావాణి ఫిర్యాదు లపై సత్వర పరిష్కారం చూపాలి Tue, Sep 24, 2024, 10:34 PM
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన Tue, Sep 24, 2024, 10:32 PM
మినీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి Tue, Sep 24, 2024, 10:29 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Tue, Sep 24, 2024, 10:26 PM
ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ Tue, Sep 24, 2024, 10:25 PM