రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు పీఆర్‌టీయు ఘనతే

byసూర్య | Tue, Sep 24, 2024, 10:19 PM

ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రంలో ఉపాద్యాయుల బదిలీలు పెంచిన ఘనత పీఆర్‌టీయు సంఘానికే దక్కుతుందన్నారు.  ఉపాద్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాడటానికి పిఆర్డీయూ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని జిల్లా పీఆర్‌టీయు అధ్యక్షుడు ఆకుల మాణయ్య అన్నారు. సోమవారం వట్‌పల్లి లో ఏర్పాటుచేసిన మండల పీఆర్‌టీయూ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అధితిగా హజరై మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న డీఏలతో పాటు పీఆర్‌సీ ఇప్పించేందుకు   ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, దసరా లోపు 2 డిఏలు రాబోతున్నాయని అందుకు సీఎం రేవెంత్‌రెడ్డితో ఒప్పంద కుదిరిందన్న సమాచరం ఉందన్నారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్, పారిశుద్య కార్మికులను ఇప్పించింది పీఆర్‌టీయునని అన్నారు. .ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ సాధించేందుకు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అనంతరం మండల పిఆర్‌ టీయూ నూతన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.


మండల శాఖ అ«ధ్యక్షుడిగా దిగంబర్‌రావు వట్‌పల్లి మండల పీఆర్‌టీయు  శాఖ అద్యక్షుడిగా పి.దిగంబరావు, ప్రధానకార్యదర్శిగా టి.సర్సింలుగౌడ్, అసోసియేట్‌ అద్యక్షుడిగా ఎం. శ్రీశైలం, మహిళ ఉపాధ్యాక్షురాలిగా కె. సునిత, కార్యదర్శిగా ఎ.శ్రీనివాస్‌లు  ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా నరోత్తం, పరిశీలకులుగా రాజమల్లు లు వ్యవహరిచారు.ఈ  కార్యక్రమంలో శాఖ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు సత్యనారాయణ,అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి సిద్దేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ప్రజావాణి ఫిర్యాదు లపై సత్వర పరిష్కారం చూపాలి Tue, Sep 24, 2024, 10:34 PM
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన Tue, Sep 24, 2024, 10:32 PM
మినీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి Tue, Sep 24, 2024, 10:29 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Tue, Sep 24, 2024, 10:26 PM
ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ Tue, Sep 24, 2024, 10:25 PM