మూసీ ప్రాంతంలో నివసించే పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన

byసూర్య | Tue, Sep 24, 2024, 09:37 PM

చెరువులు ఆక్రమణకు గురికాకుండా పర్యవేక్షిందుకు ఆయా చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారును ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, మెట్రోరైలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే పేదల వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. వారికి డబుల్ బెడ్రూం ఇల్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు. సమీక్షలో సంబంధిత అధికారులతో పాటు హైడ్రా కమిషనర్ ఉన్నారు.మూసీ అభివృద్ధి ప్రాజెక్టులోని నిర్వాసితులకు 16,002 డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ పరివాహక ప్రాంతంలో 10,200 మంది నిర్వాసితులు కానున్నట్లు గుర్తించింది. బుధవారం ఇంటింటికి వెళ్లి ఇళ్ల కేటాయింపుకు సంబంధించి వివరాలను నిర్వాసితులకు తెలియజేయనున్నారు. మూసీ బఫర్ జోన్‌లో నివసించే వ్యక్తులకు పునరావాసం ఏర్పాటు చేయాలని, నిర్మాణాలకు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు.


Latest News
 

ప్రజావాణి ఫిర్యాదు లపై సత్వర పరిష్కారం చూపాలి Tue, Sep 24, 2024, 10:34 PM
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన Tue, Sep 24, 2024, 10:32 PM
మినీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి Tue, Sep 24, 2024, 10:29 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Tue, Sep 24, 2024, 10:26 PM
ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ Tue, Sep 24, 2024, 10:25 PM