స్పెన్సర్స్ స్టోర్లు మూసివేత.. అన్ని ప్రోడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్.. ఎగబడుతున్న జనం

byసూర్య | Mon, Sep 23, 2024, 09:07 PM

హైదరాబాద్ నగరంలోని స్పెన్సర్స్ మార్కెట్లలో గత కొంత కాలంగా క్లియరెన్స్ సేల్ నడుస్తోంది. అన్ని ప్రోడక్ట్స్ మీద ఏకంగా 40 శాతానికి పైగా డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో.. జనాలు స్పెన్సర్స్ మార్కెట్లకు ఎగబడుతున్నారు. అయితే.. అసలు విషయమేంటంటే.. స్పెన్సర్స్ మార్కెట్లు త్వరలోనే కనుమరుగు కాబోతున్నాయి. ఇప్పటికే న‌గ‌రంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న స్పెన్సర్స్ మార్కెట్లు మూతపడగా.. ముషీరాబాద్ స్పెన్సర్స్‌తో పాటు అక్కడ‌క్కడ కొన్ని స్టోర్లు ఇంకా ఓపెన్ ఉన్నాయి. అయితే.. అక్టోబ‌ర్ 31వ తేదీ నుంచి హైద‌రాబాద్‌లోని అన్ని స్పెన్సర్స్ మార్కెట్లు మూతపడనున్నట్టు సమాచారం.


అయితే.. కేవలం హైదరాబాద్‌లోనే కాదు.. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని స్పెన్సర్స్ మార్కెట్లలో క్లియరెన్స్ సేల్ నడుస్తోంది. స్టోర్లలో ఉన్న స‌రుకులు, ఇత‌ర సామాగ్రిని త‌క్కువ ధ‌ర‌కే విక్రయిస్తున్నారు. ప్రతి ప్రోడక్ట్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్ పెట్టటంతో.. మార్కెట్లకు ఎగబడుతున్నారు. గతకొన్ని రోజులుగా ఈ క్లియరెన్స్ సేల్ నడుస్తుండగా.. కస్టమర్లకు మెసేజ్‌ల ద్వారా ఈ సమాచారాన్ని అందిస్తున్నారు స్టోర్ల నిర్వాహకులు. అయితే.. స్టోర్లు మూసేస్తున్నట్టు జనాలకు సమాచారం ఇవ్వకూడదని మేనేజ్మెంట్ నుంచి స్టాఫ్ కు స్పష్టమైన ఆదేశాలున్నట్టు తెలుస్తోంది. అయితే.. కొన్ని స్టోర్ల బయట మాత్రం.. స్టోర్ క్లోజ్డ్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి.


సాధారణంగా.. హైద‌రాబాద్ నగరవాసులకు స్పెన్సర్స్ సూపర్ మార్కెట్లు సుపరిచితమే. అందులోనూ మూషీరాబాద్ స్పెన్సర్స్ మార్కెట్ ప్రత్యేకం. నగరంలో మొదటి స్పెన్సర్స్ మార్కెట్‌ అయిన ఈ సూపర్ మార్కెట్‌లో కిరాణ స‌రుకులు, బ‌ట్టలు, ప్లాస్టిక్ సామాగ్రితో పాటు మ‌ద్యం కూడా దొరకటం గమనార్హం. అది కూడా క‌ల్తీ లేని మ‌ద్యం దొరుకుతుంద‌ని చాలా మంది భావిస్తుంటారు. అందుకే.. ముషీరాబాద్ స్పెన్సర్స్ మార్కెట్‌కు కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉండేది.


అయితే.. కోవిడ్ తర్వాత లోకల్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకురావటంతో.. స్పెన్సర్స్ హైపర్ మార్కెట్ స్టోర్లకు కస్టమర్లు చాలా వరకు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. దీంతో.. యాజమాన్యానికి గిట్టుబాటు కాకపోవటమే కాకుండా.. నష్టాలు కూడా వస్తున్నాయని సమాచారం. ఈ కారణంగానే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టోర్లన్నింటినీ మూసేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ విషయంపై స్పెన్సర్స్ యాజమాన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు ఇవ్వకపోవటం గమనార్హం.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM