ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం

byసూర్య | Sat, Sep 21, 2024, 01:36 PM

శుక్రవారం రోజున పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ 2024 అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాల ఆవరణలోని పిచ్చి మొక్కలు,ప్లాస్టిక్,ఇతర వ్యర్థ పదార్థాలు తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి కళాశాల కరస్పాండెంట్ అల్లెంకి శ్రీనివాస్  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని,ప్రతి విద్యార్థి స్వచ్ఛత హి సేవ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎమ్ ఏ. సమద్ ,ప్రిన్సిపల్ రవీందర్ లెక్చరర్స్ పాల్గొన్నారు.


Latest News
 

గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM
దామ్రాజపల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన Sat, Sep 21, 2024, 03:34 PM